IPL 202: DJ Bravo Dancing Vaathi Coming Step In Ground After Taking Wicket, PBKS vs CSK Clash, Watch Video - Sakshi
Sakshi News home page

వైరల్‌: వికెట్‌ తీసిన ఆనందం.. విండీస్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌‌

Published Sat, Apr 17 2021 5:08 PM | Last Updated on Sat, Apr 17 2021 5:40 PM

IPL 2021: Dwayne Bravo Viral Dance For Vaathi Coming Song After Wicket - Sakshi

ముంబై: విండీస్‌ ఆటగాళ్లంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు మారుపేరు.. ఐపీఎల్‌ ఆరంభం అయినప్పటి నుంచి ప్రతీ సీజన్‌కు రెగ్యులర్‌గా అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ గేల్‌ లాంటి ఆటగాళ్లు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌ అందించడంలో ముందు వరుసలో ఉంటారు. తాజాగా శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో డ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొట్టాడు.

మురుగన్‌ అశ్విన్‌ వికెట్‌ తీసిన ఆనందంలో విజయ్‌ నటించిన మాస్టర్‌ సినిమాలోని వాతీ కమింగ్‌ పాటకు విజయ్‌ తరహాలో డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నాడు. కాగా బ్రావో స్టెప్పులు వేసే సమయంలో పక్కనే ఉన్న అంబటి రాయుడు పడిపడి నవ్వడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘మాస్టర్’‌ సినిమాలోని ఇంట్రో సాంగ్ ‘వాతీ కమింగ్' దేశవ్యాప్తంగా బాగా పాపులర్‌ అయింది. ఆ సాంగ్‌లోని లిరిక్స్‌, డ్యాన్స్‌ స్టెప్పులను చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పటికి అనుకరిస్తూనే ఉన్నారు.

కాగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే సునాయస విజయాన్ని అందుకుంది. దీపక్‌ చహర్‌ నాలుగు వికెట్లతో టాప్‌ ఆర్డర్‌ నడ్డి విరవడంతో పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటింగ్‌లో షారుఖ్‌ ఖాన్‌ 47 పరుగులు మినహా మిగతావారెవరు రాణించలేదు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 4 వికెట్లు కోల్పోయి 15.4 ఓవరల్లో చేధించింది. సీఎస్‌కే బ్యాటింగ్‌లో మొయిన్‌ అలీ 46, డుప్లిసిస్‌ 36* పరుగులతో రాణించారు. కాగా సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 19న ముంబై వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.
చదవండి: చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్‌ మాత్రం
సూపర్‌ జడ్డూ.. ఇటు రనౌట్‌.. అటు స్టన్నింగ్‌ క్యాచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement