PC: IPL Twitter
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు (143 మ్యాచ్‌ల్లో 184) సాధించిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (మే 11) కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ రాణా వికెట్ పడగొట్టడం ద్వారా లీగ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండిన డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు)ను రెండో స్థానానికి వెనక్కునెట్టి ఐపీఎల్ టాప్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో చహల్, బ్రావోల తర్వాత ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (176 మ్యాచ్‌ల్లో 174), అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 172 వికెట్లు), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (196 మ్యాచ్‌ల్లో 171) టాప్-5లో ఉన్నారు.
కాగా, కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ 15 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 116 పరుగలు చేసింది. జేసన్ రాయ్ (10), రహ్మానుల్లా గుర్భాజ్ (18), నితిశ్ రాణా (22), ఆండ్రీ రసెల్ (10) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ (49 నాటౌట్), రింకూ సింగ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా.. చహల్, ఆసిఫ్ తలో వికెట్ దక్కించకున్నారు. పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లకు ఇది డూ ఆర్ డూమ్యాచ్. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలిచి తీరాలి.
Comments
Please login to add a commentAdd a comment