
చెన్నై: దీపావళి పండుగను పురస్కరించుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తనలోని టేబుల్ టెన్నిస్ స్కిల్‌ను బయటపెట్టాడు. స్వతహాగా క్రికెటర్ అయినప్పటికీ పలు క్రీడలు ఆడటం ధోనికి అలవాడు. క్రికెటర్‌గా మారడానికి ముందు ఎంఎస్ ధోని తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్, గోల్ఫ్, టేబుల్ టెన్నిస్‌లను ధోని సరదాగా ఆడుతూ ఉంటాడు.
ఈ క్రమంలోనే సీఎస్‌కే సహచర ఆటగాడైన బ్రేవోతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడాడు. కాగా, ధోని ఆడిన బ్యాక్‌హ్యాండ్ స్మాష్‌కు డ్వేన్ బ్రావో సైతం షాకయ్యాడు. దీంతో డ్వే బ్రావో నేను ర్యాలీ ఆడుతున్నా అని చెప్పగా ధోని తనదైన స్టైల్‌లో తాను ర్యాలీలు ఆడను అని చెప్పాడు. ఏదేమైనా ధోని, బ్రేవో సుదీర్ఘ ర్యాలీ ఆడినప్పటికీ ధోనినే పాయింట్ గెలిచాడు.2019, మార్చిలో రూపొందించిన ఈ వీడియోను సీఎస్‌కే తన ప్రమోషన్‌లో భాగంగా తాజాగా విడుదల చేసింది.
Back in March 2019, when #Thala @msdhoni, #Champion @DJBravo47 and #Sir @imjadeja were all utterly dapperly attired for a Deepavali collection shoot, they decided to conquer other sports!
— Chennai Super Kings (@ChennaiIPL) October 27, 2019
Catch it fully here https://t.co/cDWiiCu3Vg! 🦁💛 #WhistlePodu #HappyDeepavali pic.twitter.com/4LHJEEqEDF
Comments
Please login to add a commentAdd a comment