ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు. తమ జట్టు మెంటార్‌గా వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోను కేకేఆర్ మెనెజ్‌మెంట్ నియమించింది. గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన బ్రావో.. ఇప్పుడు కేకేఆర్‌తో జతకట్టాడు.
గత సీజన్‌లో కోల్‌కతా మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్ స్ధానాన్ని ఈ కరేబియన్ లెజెండ్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ అధికారికంగా ధ్రువీకరించింది. మా కొత్త మెంటార్, డిజే 'సర్ ఛాంపియన్' బ్రావోకు హాలో చెప్పండి. ఛాంపియన్ సిటీకి స్వాగతిస్తున్నాము కేకేఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
నైట్‌రైడర్స్‌తో ప్రత్యేక బంధం..
కాగా బ్రావో ఐపీఎల్‌లో ఎప్పుడూ కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించినప్పటకి.. నైట్‌రైడర్స్ యాజమాన్యంతో అతడికి మంచి అనుబంధం ఉంది. 2013 నుంచి 2020 వరకు సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023 సీజన్‌లో కూడా టీకేఆర్‌కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. కాగా కేకేఆర్, టీకేఆర్ ఇరు ఫ్రాంచైజీల యాజమాన్యం ఒక్కరే కావడం విశేషం.
ప్రొఫెషనల్ క్రికెట్‌కు విడ్కోలు..
కాగా అన్ని రకాల క్రికెట్‌కు బ్రావో విడ్కోలు పలికాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని సీజన్ ఆరంభంలోనే వెల్లడించాడు. కానీ దురదృష్టవశాత్తూ టోర్నీ మధ్యలో గాయపడడంతో.. సీజన్ మొత్తం ఆడకుంటానే తన కెరీర్‌ను ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment