RR VS LSG: Yuzvendra Chahal 7 Wickets Away To Become Highest Wicket-Taker In IPL History - Sakshi
Sakshi News home page

RR VS LSG: చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న చహల్‌... ఈ మ్యాచ్‌లోనే అవుతుందా..?

Published Wed, Apr 19 2023 4:07 PM | Last Updated on Wed, Apr 19 2023 4:27 PM

RR VS LSG: Chahal 7 Wickets Away To Become Highest Wicket Taker In IPL History - Sakshi

photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 19) జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్‌లో చహల్‌ మరో 7 వికెట్లు తీస్తే.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

ఈ జాబితాలో విండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో 183 వికెట్లతో (161 మ్యాచ్‌ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. చహల్‌ ప్రస్తుతం 177 వికెట్లతో (136 మ్యాచ్‌ల్లో) రెండో స్థానంలో నిలిచాడు. చహల్‌ ఈ రికార్డును నేటి మ్యాచ్‌లోనే నెలకొల్పడం కాస్త కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. పైగా చహల్‌ ఈ మ్యాచ్‌ తమ సొంత మైదానంలో ఆడుతుండటం అతనికి అదనంగా కలిసొచ్చే అంశం.

చదవండి: RR VS LSG: అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తర సమరం.. గెలుపెవరిది..?

అదీ కాక చహల్‌కు లక్నోపై గణమైన రికార్డు ఉంది. ఐపీఎల్‌-2022లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో చహల్‌ 4 వికెట్లతో విజృంభించాడు. అదే సీజన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కీలకమైన దీపక్‌ హుడా (59) వికెట్‌ పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుత సీజన్‌ ప్రారంభం నుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్న చహల్‌.. ఈ సీజన్‌లోనూ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా (5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇన్ని సానుకూలమైన అంశాల మధ్య చహల్‌ నేడు లక్నోతో జరిగే మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్ల ఐపీఎల్‌ రికార్డును తిరగరాస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే, రాజస్థాన్‌-లక్నో జట్ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ (5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు).. రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో కాస్త అటుఇటుగా ఉన్న ఈ రెండు జట్లలో విజేత ఎవరో అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.   

చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్‌ టెండూల్కర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement