చెన్నై: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ‍్కోలు తీసుకోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు. బ్రేవో క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం అంతర్జాతీయ క్రికెట్‌కు తీవ్రమైన లోటుగా ఆయన పేర్కొన్నారు. ‘ బ్రేవో ఒక అరుదైన ఆల్ రౌండర్. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం కచ్చితంగా క్రికెట్‌కు లోటే. ప్రధానంగా వన్డే, టీ20 ఫార్మాట్‌లో బ్రేవో స్థానం ప్రత్యేకం. అతను ఉపయోగకరమైన ఆల్ రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఒక నాణ్యమైన ఆల్ రౌండర్‌ను విండీస్ తప్పకుండా మిస్సవుతుంది. చాలామంది టాప్ ఆటగాళ్లు లేకపోవడంతో విండీస్ ఇప‍్పటికే తీవ్ర కష్టాల్లో పడింది. ఈ తరుణంలో బ్రేవో అంతర్జాతీయ క‍్రికెట్‌కు గుడ్ బై చెప్పడం విండీస్‌కు పెద్ద దెబ్బే. అయితే ప్రొఫెషనల్ కెరీర్‌ను కొనసాగిస్తానని బ్రేవో చెప్పడం ఆనందించదగింది’ అని విశ్వనాథన్ పేర‍్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సీఎస్‌కే తరుపున బ్రేవో ఆడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment