ఆకాశమే హద్దు... పట్టపగ్గాల్లేవ్.. వీర విజృంభణ... ఇలాంటి విశేషణాల కలబోతగా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి చెలరేగిపోయాడు. మంగళవారం ఢాకా డైనమైట్స్, రంగ్‌పూర్ రైడర్స్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) ఫైనల్లో విశ్వరూపం చూపాడు. రైడర్స్ ఓపెనర్‌గా వచ్చిన గేల్ 69 బంతుల్లోనే అజేయంగా 146 పరుగులు చేశాడు. 22 పరుగుల వద్ద షకీబుల్ హసన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతడు తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలో ఏకంగా 18 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. గేల్‌తో పాటు బెండ్రన్ మెకల్లమ్ (54, 4 ఫోర్లు, మూడు సిక్స్‌లు) అదరగొట్టడంతో రంగ్‌పూర్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఢాకా డైనమైట్స్ 149/9కే పరిమితం కావడంతో రైడర్స్ తొలిసారి బీపీఎల్ టైటిల్ నెగ్గింది.
బీపీఎల్ ఫైనల్లో విండీస్ స్టార్ విధ్వంసం
Published Wed, Dec 13 2017 7:09 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement