
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ హెచ్‌ఎస్ ప్రణయ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టగా... లక్ష్య సేన్, ప్రియాన్షుæ, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. జకార్తాలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–19, 14–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో... ప్రణయ్ 18–21, 21–19, 10–21తో లో కీన్ యె (సింగపూర్) చేతిలో ఓడిపోయారు.