జకార్తా: భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లు ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సింధు 23-21, 21-7 తేడాతో గ్రెగోరియా మరిస్కా (ఇండోనేసియా)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప‍్రవేశించగా, పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ పోరులో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21-14, 21-9 తేడాతో కెంటో నిషిమోటో (జపాన్)పై విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్‌లో సింధు తొలి గేమ్‌ను పోరాడి గెలవగా, రెండో గేమ్‌లో అవలీలగా సొంతం చేసుకున్నారు. కేవలం 37 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు తన అనుభవాన్ని ఉపయోగించి క్వార్టర్‌లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో కరోలినా మారిన్(స్పెయిన్)తో సింధు తలపడే అవకాశం ఉంది. ఇక పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఏకపక్ష విజయం సాధించాడు. తొలి గేమ్‌ను 21-14తో గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment