Anshu Malik
-
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
ఇస్తాంబుల్: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లు ఆఖరి ప్రయత్నం చేయనున్నారు. గురువారం నుంచి ఇస్తాంబుల్‌లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో 6 బెర్త్‌లు, గ్రీకో రోమన్ విభాగంలో 6 బెర్త్‌లు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో ఇప్పటి వరకు భారత రెజ్లర్లకు ఒక్క బెర్త్ కూడా దక్కలేదు. మహిళల విభాగంలో 6 బెర్త్‌లకుగాను నాలుగు బెర్త్‌లు (అంతిమ్–53 కేజీలు, వినేశ్ ఫొగాట్–50 కేజీలు, అన్షు మలిక్–57 కేజీలు, రీతిక–76 కేజీలు) భారత రెజ్లర్లు సంపాదించారు. -
Uttarkashi tunnel collapse: నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి నాలుగు రోజులుగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకోసం మరో భారీ యంత్రాన్ని తెప్పించారు. మూడు విడిభాగాలుగా యుద్ధవిమానాల్లో తరలించిన ఈ యంత్రాన్ని అసెంబుల్ చేసి, మరికొద్ది గంటల్లో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కుప్పకూలిన టన్నెల్ శిథిలాల గుండా ఆగర్ మెషీన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు అధికారులు మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 800, 900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో పనులకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి అమెరికన్ ఆగర్ అధికారులు హుటాహుటిన భారీ అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ భాగాలను భారత వాయుసేన విమానాల ద్వారా 30 కిలోమీటర్ల దగ్గర్లోని చిన్యాలిసౌర్‌కు తెప్పించారు. అక్కడి నుంచి ఘటనాస్థలికి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నామని ఎస్పీ అర్పణ్ తెలిపారు. వీటిని అసెంబ్లింగ్ చేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు థాయ్‌లాండ్, నార్వే నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు నేషనల్ హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎన్‌హెచ్‌ఐడి) డైరెక్టర్ అన్షు మాలిక్ తెలిపారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ జట్టు జూనియర్ ఆటగాళ్లను అక్కడి సంస్థ నిపుణులు వారం పాటు శ్రమించి సురక్షితంగా తీసుకువచి్చన విషయం తెలిసిందే. -
సైనాకు చేదు అనుభవం
జకార్తా: ఈ ఏడాది ఆడుతున్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. మలేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లో, ఇండియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా... తాజాగా ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలోనూ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సైనా 15–21, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ హాన్ యు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏ దశలోనై చైనా ప్లేయర్‌కు పోటీనివ్వలేకపోయింది. తొలి గేమ్‌లోనైతే సైనా ఆరంభంలోనే వరుసగా 10 పాయింట్లు కోల్పోయి 0–10తో వెనుకబడిపోయింది. క్వార్టర్స్‌లో లక్ష్య సేన్ ఇక రెండో గేమ్‌లో సైనా తొలుత వరుసగా మూడు పాయింట్లు, అనంతరం వరుసగా ఎనిమిది పాయింట్లు సమర్పించుకొని కోలుకోలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–8, 21–17తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. చదవండి: పోటీకి సిద్ధమైన రెజ్లర్లు ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టోర్నీ జాగ్రెబ్ ఓపెన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగేందుకు భారత అగ్రశ్రేణి రెజ్లర్లు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు క్రొయేషియాలో జరిగే ఈ టోర్నీలో టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్, రవి కుమార్, దీపక్ పూనియాలు పోటీపడనున్నారు. వీరితోపాటు మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, అన్షు మలిక్ బరిలోకి దిగనున్నారు. ఒకవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు కాగా.. మరోవైపు ఈ మేరకు రెజ్లర్లు టోర్నికి సిద్ధం కావడం విశేషం. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే? -
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్‌ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో రజతం, 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం
Asian Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ మహిళల విభాగంలో శుక్రవారం భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం మూడు పతకాలు లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ అన్షు మలిక్ (57 కేజీలు), రాధిక (65 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... మనీషా (62 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సుగుమి సకురాయ్ (జపాన్)తో జరిగిన ఫైనల్లో అన్షు 0–4తో ఓడిపోయింది. అంతకుముందు అన్షు వరుసగా మూడు బౌట్లలో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించడం) పద్ధతిలో షోఖిడా (ఉజ్బెకిస్తాన్)పై... డానియెలా స్యు చింగ్ లిమ్ (సింగపూర్)పై, బొలోర్‌తుయా (మంగోలియా)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐదుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో 65 కేజీల విభాగంలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. భారత రెజ్లర్ రాధిక మూడు బౌట్లలో గెలిచి, ఒక బౌట్లో ఓడిపోయి రెండో స్థానంతో రజతం నెగ్గింది. 62 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మనీషా 4–2తో హన్బిట్ లీ (కొరియా)పై గెలిచింది. చదవండి: Rishabh Pant: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Anshu Malik: భారత తొలి మహిళా రెజ్లర్‌గా సరికొత్త చరిత్ర!
Anshu Malik First Indian Woman Win Silver Medal: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాలని ఆశించిన అన్షు మలిక్‌కు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్లో 20 ఏళ్ల అన్షు ‘బై ఫాల్’ పద్ధతిలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ హెలెన్ లూయిస్ మరూలీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. తొలి విరామానికి 1–0తో అన్షు ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో భాగం ఆరంభంలోనే హెలెన్ 2 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచిన హెలెన్ తన ఆధిక్యాన్ని 4–1కు పెంచుకుంది. ఈ దశలో హెలెన్ తన పట్టుతో అన్షును కిందకు పడేసి ఆమె రెండు భుజాలను కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు తగిలించి పెట్టింది. దాంతో హెలెన్ ‘బై ఫాల్’ పద్ధతిలో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. తాజా ఫలితంతో అన్షు రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో రజతం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు గుర్తింపు పొందింది. ఈ క్రమంలో కేంద్ర క్రీడాశాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు అన్షుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సరితాకు కాంస్యం మరోవైపు ఈ మెగా ఈవెంట్‌లోని మహిళల 59 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సరితా మోర్ కాంస్యంతో మెరిసింది. సారా జోనా లిండ్‌బోర్గ్ (స్వీడన్)తో జరిగిన కాంస్య పతక పోరులో సరిత 8–2తో విజయం సాధించింది. అల్కా తోమర్, బబితా ఫొగాట్, గీతా ఫొగాట్, వినేశ్ ఫొగాట్, పూజా ధాండాల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన ఆరో భారతీయ మహిళా రెజ్లర్‌గా, ఓవరాల్‌గా పతకం నెగ్గిన ఏడో భారతీయ మహిళా రెజ్లర్‌గా సరిత గుర్తింపు పొందింది. చదవండి: Indian Hockey: హర్మన్‌ప్రీత్ సింగ్, గుర్జీత్ కౌర్‌లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు So proud of you Anshu ! That’s the spirit ! 1st 🇮🇳 woman wrestler to win a SILVER 🥈 at prestigious World Championship | @OLyAnshu | pic.twitter.com/aY2jNccXtG — Anurag Thakur (@ianuragthakur) October 7, 2021 -
Anshu Malik: తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు కొత్త రికార్డు!
ఓస్లో (నార్వే): టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశ పరిచినా... ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ అన్షు మలిక్ అదరగొట్టింది. గతంలో ఏ భారతీయ మహిళా రెజ్లర్‌కు సాధ్యంకాని ఘనతను 20 ఏళ్ల అన్షు సాధించింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు రికార్డు నెలకొల్పింది. 57 కేజీల విభాగంలో అన్షు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అన్షు 11–0 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో సొలోమియా వినిక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. 3 నిమిషాల 53 సెకన్లలో అన్షు విజయం ఖాయమైంది. ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతి అంటే ప్రత్యర్థిపై కనీసం 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే బౌట్‌ను ముగించి ఈ ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో అన్షు 5–1తో దావాచిమెగ్ ఎర్కెమ్బాయర్ (మంగోలియా)పై, తొలి రౌండ్లో 4 నిమిషాల 5 సెకన్లలో 15–5 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో నీలూఫర్ రైమోవా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్, 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హెలెన్ లూయిస్ మరూలిస్ (అమెరికా)తో అన్షు తలపడుతుంది. ప్రపంచ చాంపియన్‌ను ఓడించి... మరోవైపు 59 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సరితా మోర్ కాంస్య పతకం కోసం పోటీపడనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో సరితా మోర్ 0–3 పాయింట్ల తేడాతో యూరోపియన్ చాంపియన్ నిలిచిన బిల్యానా జికోవా డుడోవా (బల్గేరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో సరితా 8–4తో ప్రపంచ చాంపియన్ లిండా మొరైస్ (కెనడా)పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సరితా 3–1తో సాండ్రా (జర్మనీ)పై గెలిచింది. ఇనెటా (లిథువేనియా), సారా జోనా లిండ్‌బోర్గ్ (స్వీడన్) మధ్య బౌట్ విజేతతో నేడు జరిగే కాంస్య పతక పోరులో సరితా మోర్ తలపడుతుంది. 72 కేజీల విభాగంలో దివ్యా కక్రాన్ కాంస్య పతకం రేసులో నిలిచింది. దివ్య క్వార్టర్ ఫైనల్లో 0–10తో మసాకో ఫురూచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. అయితే మసాకో ఫైనల్ చేరడంతో దివ్యా ‘రెపిచాజ్’ రౌండ్లో నేడు దావానసన్ (మంగోలియా)తో ఆడుతుంది. ఈ బౌట్లో దివ్య గెలిస్తే కాంస్య పతకం కోసం అనా కార్మెన్ షెల్ (జర్మనీ)తో పోటీపడుతుంది. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం ఖాయం చేసుకున్న ఆరో భారతీయ మహిళా రెజ్లర్ అన్షు మలిక్. గతంలో అల్కా తోమర్ (2006లో; 59 కేజీలు), బబితా ఫొగాట్ (2012లో; 51 కేజీలు), గీతా ఫొగాట్ (2012లో; 55 కేజీలు), పూజా ధాండా (2018లో; 57 కేజీలు), వినేశ్ ఫొగాట్ (2019లో; 53 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. కిరణ్‌కు నిరాశ మహిళల 76 కేజీల విభాగంలో భారత్‌కు త్రుటిలో కాంస్య పతకం చేజారింది. కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ కిరణ్ 1–2తో సమర్ హంజా (ఈజిప్‌్ట) చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో భారత్‌కు నాలుగోసారి కాంస్య పతకం చేజారింది. పురుషుల ఫ్రీస్టయిల్లో రవీందర్ (61 కేజీలు), రోహిత్ (65 కేజీలు), మహిళల విభాగంలో పింకీ (55 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో ఓడిపోయారు.