ఇస్తాంబుల్: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లు ఆఖరి ప్రయత్నం చేయనున్నారు. గురువారం నుంచి ఇస్తాంబుల్‌లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో 6 బెర్త్‌లు, గ్రీకో రోమన్ విభాగంలో 6 బెర్త్‌లు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో ఇప్పటి వరకు భారత రెజ్లర్లకు ఒక్క బెర్త్ కూడా దక్కలేదు. మహిళల విభాగంలో 6 బెర్త్‌లకుగాను నాలుగు బెర్త్‌లు (అంతిమ్–53 కేజీలు, వినేశ్ ఫొగాట్–50 కేజీలు, అన్షు మలిక్–57 కేజీలు, రీతిక–76 కేజీలు) భారత రెజ్లర్లు సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment