
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి రుత్విక శివాని మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. బెంగళూరులో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన రుత్విక (తెలంగాణ)–రోహన్ కపూర్ (ఢిల్లీ) జోడీ చాంపియన్‌గా నిలిచింది.
ఫైనల్లో రుత్విక–రోహన్ ద్వయం 21–12, 21–16తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)–త్రిషా హెగ్డే (కర్ణాటక) జోడీపై నెగ్గింది. టైటిల్ గెలిచే క్రమంలో రుతి్వక–రోహన్ తమ ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు.
Comments
Please login to add a commentAdd a comment