![Australian Open badminton:Sai Praneeth, Sameer Verma crash out - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/12/SUMEET-MANU-LAGOS_0.jpg.webp?itok=GDVAuMzE)
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మను అత్రితో కలిసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సుమీత్–మను ద్వయం 17–21, 21–19, 21–18తో భారత్‌కే చెందిన అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంటపై గెలుపొందింది.
సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాయి ప్రణీత్ 12–21, 14–21తో లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో... సమీర్ వర్మ 14–21, 6–21తో లూ గ్వాంగ్‌జు (చైనా) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment