పీవీ సింధు (PC: BAI)
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–17తో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై విజయం సాధించింది.
ఈ క్రమంలో శనివారం జరిగే సెమీ ఫైనల్లో యో జియా మిన్ (సింగపూర్)తో సింధు ఆడుతుంది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. టాప్ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 18–21, 15–21తో ఓడిపోయాడు.
చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ..
Comments
Please login to add a commentAdd a comment