
కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఆకట్టుకోలేకపోయారు. మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్‌లో వీరిద్దరి పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 16–21, 16–21తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 8–21, 7–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యారు. తై జు యింగ్ చేతిలో సింధుకిది 12వ ఓటమికాగా... మారిన్ చేతిలో సైనా ఓడటం ఇది ఏడోసారి. క్వార్టర్స్‌లో ని్రష్కమించిన సింధు, సైనాలకు 2,400 డాలర్ల (రూ. లక్షా 70 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment