
పుణే: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో రుత్విక శివాని 16–21, 21–14, 21–12తో తెలంగాణకే చెందిన సామియా ఇమాద్ ఫారూఖిపై విజ యం సాధించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయాల బారిన పడిన రుతి్వక ఇటీవలే కోలుకొని మళ్లీ రాకెట్ పట్టింది. ఈ టోర్నీ క్వాలిఫయింగ్‌లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో రుత్విక తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment