రన్నరప్ రుత్విక, రాహుల్ | runner-up ruthvika | Sakshi
Sakshi News home page

రన్నరప్ రుత్విక, రాహుల్

Published Mon, Feb 29 2016 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

రన్నరప్ రుత్విక, రాహుల్

రన్నరప్ రుత్విక, రాహుల్

వల్సాడ్ (గుజరాత్): అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, రాహుల్ యాదవల్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో రుత్విక... పురుషుల సింగిల్స్ విభాగంలో రాహుల్ రన్నరప్‌లుగా నిలిచారు. మహిళల ఫైనల్లో ఐదో సీడ్ రుత్విక 21-12, 17-21, 5-21తో పీసీ తులసీ (కేరళ) చేతిలో ఓటమి చవిచూడగా...

పురుషుల ఫైనల్లో 15వ సీడ్ రాహుల్ 10-21, 13-21తో రెండో సీడ్ శ్రేయాన్ష్ జైస్వాల్ (ఎయిరిండియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.హేమనాగేంద్ర బాబు మిక్స్‌డ్ డబుల్స్‌లో, పురుషుల డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. మిక్స్‌డ్ ఫైనల్లో హేమనాగేంద్ర బాబు-పూర్వీషా ద్వయం 22-24, 17-21తో అరుణ్ విష్ణు-అపర్ణ జంట చేతిలో... పురుషుల డబుల్స్ ఫైనల్లో హేమనాగేంద్ర బాబు-దిజు జంట 10-21, 14-21తో జిష్ణు సాన్యాల్-శివమ్ శర్మ జోడీ చేతిలో ఓడిపోయాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement