
ప్రణయ్
సుజౌ (చైనా): సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత జట్టు విజయంతో ముగించింది. గ్రూప్ ‘సి’లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1తో గెలుపొందింది. చైనీస్ తైపీ, మలేసియా జట్లతో జరిగిన తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోవడంతో నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది.
తొలి మ్యాచ్‌లో సాయిప్రతీక్–తనీషా క్రాస్టో 21– 17, 14–21, 18–21తో కెనెత్ చూ–గ్రోన్యా సోమర్‌విలె చేతిలో ఓడిపోయారు. అనంతరం రెండో మ్యాచ్‌లో ప్రణయ్ 21–8, 21–8తో జాక్ యుపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో అనుపమ 21–16, 21–18తో టిఫానీ హోపై, నాలుగో మ్యాచ్‌లో అర్జున్–ధ్రువ్ 21–11, 21–12తో టాంగ్–రేన్ వాంగ్‌లపై, ఐదో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–19, 21–13తో కైట్లిన్–ఎంజెలా యులపై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment