టెన్నిస్ లో భారత్ కు చుక్కెదురు | India out of medal contention in Asiad tennis team events | Sakshi
Sakshi News home page

టెన్నిస్ లో భారత్ కు చుక్కెదురు

Published Mon, Sep 22 2014 5:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

టెన్నిస్ లో భారత్ కు చుక్కెదురు

టెన్నిస్ లో భారత్ కు చుక్కెదురు

ఇంచియాన్:ఆసియా క్రీడల్లో దుమ్ములేపుతూ క్వార్టర్స్ కు వెళ్లిన భారత టెన్నిస్ ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. 17వ ఆసియా గేమ్స్ లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ లో అటు పురుషుల జట్టు, ఇటు మహిళల జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించి ఓటమి  చవిచూసింది. దీంతో సింగిల్స్ విభాగంలో భారత్ పెట్టకున్న ఆశలు ఆవిరైపోయాయి. భారత పురుషుల విభాగంలో సనమ్ సింగ్ పై 6-7, 6-7 తేడాతో కజికిస్తాన్ ఆటగాడు నిడోవోసావ్ విజయం సాధించాడు. అనంతరం యూకీ బాంబ్రీ కూడా ఇదే బాటలో పయనించాడు. యూకే బాంబ్రీ 2-6, 7-6, 1-6 తేడాతో మిఖైల్ కుకుష్ కిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కాగా కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చినా భారత్ 1-2 తేడాతో వెనుకబడటంతో ఈ ఈవెంట్ లో పతకం ఆశలు కూడా ఆవిరయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement