ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండానే... | India blank Nepal 3-0 in men's tennis, into quarters | Sakshi
Sakshi News home page

ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండానే...

Published Sun, Sep 21 2014 11:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

ఒక్క పాయింట్  కూడా ఇవ్వకుండానే...

ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండానే...

ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు దుమ్ము రేపారు. ప్రత్యర్థులను చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషులు సింగిల్స్ విభాగంలో జరిగిన మ్యాచ్ లో నేపాల్ ఆటగాడు జితేంద్ర పరియార్ పై భారత్ ఆటగాడు యూకీ బాంబ్రీ  6-0 6-0 తో విజయం సాధించాడు. ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తు చేశాడు.

మరో మ్యాచ్ లో అభిషేక్ బస్టోలా(నేపాల్)పై భారత్ టెన్నిస్ ప్లేయర్ సనమ్ సింగ్ 6-0 6-1తో గెలిచాడు. డబుల్స్ విభాగంలో దివిజ్ శరణ్-సాకేత్ మైనేని(భారత్) జోడీ సంతోష్ ఖాత్రి-సోనమ్ దావాపై 6-0 6-0తో ఘన విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement