Sanam singh
-
క్వార్టర్స్‌లో సాకేత్-సనమ్ జోడీ
ఏటీపీ చాలెంజర్ టోర్నీ పుణే: మరో డబుల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సాకేత్-సనమ్ ద్వయం 6-1, 6-1తో తెముర్ ఇస్మయిలోవ్ (ఉజ్బెకిస్తాన్)-అర్పిత్ శర్మ (భారత్) జంటపై గెలిచింది. అయితే సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. రెండు గంటల మూడు నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సాకేత్ 7-5, 4-6, 2-6తో ఇల్యా ఇవష్కా (బెలారస్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ టోర్నీతో సాకేత్ ఈ సీజన్‌ను ముగిస్తున్నాడు. ఈ ఒక్క నెలలోనే సాకేత్ మూడు టోర్నీల్లో బరిలోకి దిగి ఏకంగా 25 మ్యాచ్‌ల్లో (14 సింగిల్స్, 11 డబుల్స్) పాల్గొన్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సనమ్ సింగ్, విజయ్ సుందర్ ప్రశాంత్‌లు సింగిల్స్‌లో రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో సోమ్‌దేవ్ 6-4, 7-5తో మాక్సిమ్ జాన్వీర్ (ఫ్రాన్స్)పై, సనమ్ సింగ్ 6-4, 6-1తో అలెజాంద్రో బెగా (ఇటలీ)పై, ప్రశాంత్ 6-4, 6-4తో ఆర్థర్ డీ గ్రీఫ్ (బెల్జియం)పై గెలిచారు. -
ఫైనల్లో సాకేత్ జంట
హాంకాంగ్: హాంకాంగ్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-2, 6-1తో నీల్స్ డెసిన్ (జర్మనీ)-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి ద్వయం సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్ 6-7 (3/7), 1-6తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్) చేతిలో; సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 4-6, 4-6తో ఇటో తత్సుమా (జపాన్) చేతిలో ఓడిపోయారు. లలిత్‌కు మూడో విజయం జిబ్రాల్టర్: జిబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు వరుసగా మూడో విజయం నమోదు చేశాడు. మూడో రౌండ్లో అతను 49 ఎత్తుల్లో డిఫెండింగ్ చాంపియన్ చెపరినోవ్ (బల్గేరియా)పై నెగ్గాడు. దీంతో లలిత్ మూడు పాయింట్లతో సంయుక్తంగా అధిక్యంలో కొనసాగుతున్నాడు. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 26 ఎత్తుల్లో క్రిస్టియాన్ చిరిలా (రొమేనియా)పై గెలిచాడు. ద్రోణవల్లి హారిక, ఉర్బినా (స్పెయిన్) మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. -
టెన్నిస్ లో భారత్ కు చుక్కెదురు
ఇంచియాన్:ఆసియా క్రీడల్లో దుమ్ములేపుతూ క్వార్టర్స్ కు వెళ్లిన భారత టెన్నిస్ ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. 17వ ఆసియా గేమ్స్ లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ లో అటు పురుషుల జట్టు, ఇటు మహిళల జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించి ఓటమి చవిచూసింది. దీంతో సింగిల్స్ విభాగంలో భారత్ పెట్టకున్న ఆశలు ఆవిరైపోయాయి. భారత పురుషుల విభాగంలో సనమ్ సింగ్ పై 6-7, 6-7 తేడాతో కజికిస్తాన్ ఆటగాడు నిడోవోసావ్ విజయం సాధించాడు. అనంతరం యూకీ బాంబ్రీ కూడా ఇదే బాటలో పయనించాడు. యూకే బాంబ్రీ 2-6, 7-6, 1-6 తేడాతో మిఖైల్ కుకుష్ కిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కాగా కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చినా భారత్ 1-2 తేడాతో వెనుకబడటంతో ఈ ఈవెంట్ లో పతకం ఆశలు కూడా ఆవిరయ్యాయి. -
ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండానే...
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు దుమ్ము రేపారు. ప్రత్యర్థులను చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషులు సింగిల్స్ విభాగంలో జరిగిన మ్యాచ్ లో నేపాల్ ఆటగాడు జితేంద్ర పరియార్ పై భారత్ ఆటగాడు యూకీ బాంబ్రీ 6-0 6-0 తో విజయం సాధించాడు. ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తు చేశాడు. మరో మ్యాచ్ లో అభిషేక్ బస్టోలా(నేపాల్)పై భారత్ టెన్నిస్ ప్లేయర్ సనమ్ సింగ్ 6-0 6-1తో గెలిచాడు. డబుల్స్ విభాగంలో దివిజ్ శరణ్-సాకేత్ మైనేని(భారత్) జోడీ సంతోష్ ఖాత్రి-సోనమ్ దావాపై 6-0 6-0తో ఘన విజయం సాధించింది. -
సాకేత్ జోడికి రెండో డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి గతవారం కోల్‌కతాలో తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్ నెగ్గిన సాకేత్ అదే ఫలితాన్ని ఢిల్లీలోనూ పునరావృతం చేశాడు. శనివారం జరిగిన ఫైనల్లో సాకేత్-సనమ్ ద్వయం 7-6 (7/5), 6-4తో రెండో సీడ్ సంచాయ్ రాటివటానా-సొంచాట్ రాటివటానా (థాయ్‌లాండ్) జోడిని బోల్తా కొట్టించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు రాటివటానా బ్రదర్స్ ఏకంగా ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. విజేతగా నిలిచిన సాకేత్ జోడికి 6,200 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్లో సోమ్‌దేవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో సోమ్‌దేవ్ 6-4, 6-2తో ఎవగెని డాన్స్కాయ్ (రష్యా)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్) 4-6, 7-6 (7/3), 6-3తో ఇలిజా బొజాల్‌జాక్ (సెర్బియా)ను ఓడించి సోమ్‌దేవ్‌తో ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. కెరీర్లో మూడుసార్లు ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన సోమ్‌దేవ్ రెండుసార్లు విజేతగా నిలిచి మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
మెయిన్ డ్రాకు సనమ్ సింగ్
చెన్నై: భారత యువ టెన్నిస్ ఆటగాడు సనమ్ సింగ్ పీఎల్ రెడ్డి స్మారక ఏటీపీ చాలెంజర్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సనమ్ 6-2, 6-2తో రెండో సీడ్ మారెక్ సెంజాన్ (స్లొవేకియా)కు షాకిచ్చాడు. స్థానిక ఆటగాళ్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 7-6(4), 6-3తో శశికుమార్‌ను ఓడించి మెయిన్ డ్రాలో చోటు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ విక్టర్ బలూడా (రష్యా) 7-5, 4-6, 7-6(4)తో రిచర్డ్ బెకర్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గగా, మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) 6-2, 6-1తో కరుణుదయ్సింగ్పై గెలుపొంది మెయిన్ డ్రాకు చేరాడు. -
రన్నరప్ సనమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత యువ ఆటగాడు సనమ్ సింగ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టొరంటోలో శనివారం జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ పీటర్ పొలాస్కీ (కెనడా) 6-2, 6-2తో రెండో సీడ్ సనమ్ సింగ్‌పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సనమ్ 6-3, 3-6, 7-5తో ఐదో సీడ్ మైకేల్ షాబాజ్ (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గాడు. ఈ సీజన్లో రెండో ఐటీఎఫ్ టైటిల్ చేజిక్కించుకోవాలనుకున్న భారత ఆటగాడి ఆశలపై పొలాస్కీ నీళ్లు చల్లాడు. వరుస సెట్లలో సనమ్ ఆటకట్టించాడు. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో సనమ్ తొలి టైటిల్ గెలిచాడు.