రన్నరప్ సనమ్ | Runner-up Sanam singh | Sakshi
Sakshi News home page

రన్నరప్ సనమ్

Published Sun, Sep 15 2013 1:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

రన్నరప్ సనమ్

రన్నరప్ సనమ్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు సనమ్ సింగ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టొరంటోలో శనివారం జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ పీటర్ పొలాస్కీ (కెనడా) 6-2, 6-2తో రెండో సీడ్ సనమ్ సింగ్‌పై విజయం సాధించాడు.
 
 అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సనమ్ 6-3, 3-6, 7-5తో ఐదో సీడ్ మైకేల్ షాబాజ్ (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గాడు. ఈ సీజన్‌లో రెండో ఐటీఎఫ్ టైటిల్ చేజిక్కించుకోవాలనుకున్న భారత ఆటగాడి ఆశలపై పొలాస్కీ నీళ్లు చల్లాడు. వరుస సెట్లలో సనమ్ ఆటకట్టించాడు. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో సనమ్ తొలి టైటిల్ గెలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement