international tennis tournment
-
రష్మిక శుభారంభం
అంతర్జాతీయ మహిళల టెన్నిస్ (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది. సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన ఆమె, డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పెర్త్‌లో జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6–3, 6–3తో జెస్సీ కులే (ఆస్ట్రేలియా)పై గెలిచింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక (భారత్)–మోనిక్ బ్యారీ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 7–6 (7/5)తో ఎలీనా మిసిచ్ (ఆ్రస్టేలియా)–మిచికా ఒజెకి (జపాన్) జంటను ఓడించింది. -
రెండో రౌండ్లో విఘ్నేశ్
ఐటీఎఫ్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-4 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. విఘ్నేశ్, కాజా వినాయక్ శర్మ శుభారంభం చేయగా... క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడిన అశ్విన్ విజయరాఘవన్ తొలి రౌండ్లో ఓడిపోయాడు. తిరుచ్చిలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో విఘ్నేశ్ 4-6, 6-2, 7-6 (7/1)తో జానిస్ లినిగెర్ (స్విట్జర్లాండ్)పై; వినాయక్ శర్మ 6-2, 7-5తో నితిన్ కీర్తనే (భారత్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) 6-0, 1-0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అశ్విన్ విజయరాఘవన్ గాయంతో వైదొలిగాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెదున్‌చెజియాన్ కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. -
రన్నరప్ సనమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత యువ ఆటగాడు సనమ్ సింగ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టొరంటోలో శనివారం జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ పీటర్ పొలాస్కీ (కెనడా) 6-2, 6-2తో రెండో సీడ్ సనమ్ సింగ్‌పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సనమ్ 6-3, 3-6, 7-5తో ఐదో సీడ్ మైకేల్ షాబాజ్ (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గాడు. ఈ సీజన్లో రెండో ఐటీఎఫ్ టైటిల్ చేజిక్కించుకోవాలనుకున్న భారత ఆటగాడి ఆశలపై పొలాస్కీ నీళ్లు చల్లాడు. వరుస సెట్లలో సనమ్ ఆటకట్టించాడు. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో సనమ్ తొలి టైటిల్ గెలిచాడు.