
ఫ్లోరిడా (అమెరికా): భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ వరుసగా రెండో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. గతవారం ఇండియన్ వెల్స్ టోర్నీలో క్వాలిఫయర్‌గా పాల్గొని మూడో రౌండ్‌కు చేరిన ఈ ఢిల్లీ ప్లేయర్... తాజాగా మయామి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’ బెర్త్ దక్కించుకున్నాడు.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో ప్రపంచ 107వ ర్యాంకర్ యూకీ 7–5, 6–2తో ప్రపంచ 133వ ర్యాంకర్ ఇలియాస్ వైమెర్ (స్వీడన్)పై గెలుపొందాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో బేసిక్ మీర్జా (బోస్నియా)తో యూకీ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో అతను నెగ్గితే రెండో రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ జాక్ సోక్ (అమెరికా) ప్రత్యర్థిగా ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment