
లండన్: భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఏటీపీ–500 ఫీవర్ ట్రీ చాంపియన్‌షిప్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. లండన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అతను క్వాలిఫయింగ్ విభాగంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో యూకీ 6–4, 6–2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై నెగ్గాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన యూకీ తొలి రౌండ్‌లో ప్రపంచ 35వ ర్యాంకర్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment