సాకేత్ జోడి పరాజయం | Yuki Bhambri enters Chennai Open quarters as Fognini retires | Sakshi
Sakshi News home page

సాకేత్ జోడి పరాజయం

Published Sat, Jan 4 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

యూకీ బాంబ్రీ

యూకీ బాంబ్రీ

చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ యువతార సాకేత్ మైనేని జోడి సెమీఫైనల్లో... రామ్‌కుమార్-శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాయి. సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో ‘వైల్డ్ కార్డు’ జోడి సాకేత్-కరెన్ ఖచనోవ్ (రష్యా) 4-6, 3-6తో నాలుగో సీడ్ బ్రన్‌స్ట్రోమ్ (స్వీడన్)-ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది.

గురువారం ఆలస్యంగా ముగిసిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జోడిని 7-5, 2-6, 12-10తో బోల్తా కొట్టించిన సాకేత్-ఖచనోవ్ సెమీఫైనల్లో అదే జోరును కనబర్చలేకపోయారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో రామ్‌కుమార్-శ్రీరామ్ బాలాజీ జంట 3-6, 3-6తో ద్రగంజా-మేట్ పావిక్ (క్రొయేషియా) ద్వయం చేతిలో ఓడింది.
 
 వావ్రింకా 300వ విజయం
 పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ యూకీ బాంబ్రీ 3-6, 3-6తో ప్రపంచ 32వ ర్యాంకర్ పోస్పిసిల్ (కెనడా) చేతిలో ఓడాడు. 69 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీకి ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం రాలేదు. మరో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్  వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-2, 6-1తో బెదెన్ (స్లొవేకియా)ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకోవడంతోపాటు కెరీర్‌లో 300వ విజయాన్ని నమోదు చేశాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో  వాసెలిన్ (ఫ్రాన్స్) 7-5, 6-7 (6/8), 6-0తో సెలా (ఇజ్రాయెల్)పై, గ్రానోలెర్స్ (స్పెయిన్) 6-2, 3-6, 7-6 (7/5)తో పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గి సెమీస్‌కు చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement