యూకీ సంచలన విజయం | Chennai Open: Yuki Bhambri stuns higher-rated Busta, Somdev exits in first round | Sakshi
Sakshi News home page

యూకీ సంచలన విజయం

Published Wed, Jan 1 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

యూకీ బాంబ్రీ

యూకీ బాంబ్రీ

 చెన్నై: ఏటీపీ టోర్నీ చెన్నై ఓపెన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సంచలన విజయం సాధించాడు. వైల్డ్‌కార్డ్ ద్వారా బరిలోకి దిగిన యూకీ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 64వ ర్యాంకర్ పాబ్లో బస్టా (స్పెయిన్)ను ఓడించాడు. 76 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో బాంబ్రీ 6-4, 6-3 స్కోరుతో నెగ్గాడు.
 
 సోమ్‌దేవ్‌కు రామ్‌కుమార్ షాక్
 భారత నంబర్‌వన్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు సహచరుడు రామ్‌కుమార్ రామ్‌నాథన్ షాక్ ఇచ్చాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన రామ్‌కుమార్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 4-6, 6-3, 6-4 స్కోరుతో సోమ్‌దేవ్‌పై సంచలన విజయం సాధించాడు. దాదాపు 2 గంటల 22 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ ఓడినా...చక్కటి పోరాట పటిమతో రామ్ గెలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement