![Yuki Bhambri Jodi loss](/styles/webp/s3/article_images/2024/06/15/uki_0.jpg.webp?itok=tQVMHzk3)
బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లో ఓడిపోయింది. స్టుట్‌గార్ట్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 5–7, 4–6తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం 12 ఏస్‌లు సంధించింది. తమ సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment