
క్వార్టర్స్‌లో యూకీ
న్యూఢిల్లీ : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తైపీలో గురువారం జరి గిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో యూకీ 6-3, 6-1తో ఎనిమిదో సీడ్ జిమ్మీ వాంగ్ (చైనీస్ తైపీ)పై అలవోక విజయం సాధించాడు.
64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీకి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ గో సొయెదా (జపాన్)తో యూకీ ఆడతాడు.