
యూకీ బాంబ్రీ సంచలనం
ఏటీపీ సిటీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సంచలనం సృష్టించాడు.
ఏటీపీ సిటీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సంచలనం సృష్టించాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి ప్రపంచ 22వ ర్యాంకర్ గేయల్ మోన్‌ఫిల్స్‌ను మట్టికరిపించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో ఈ ఢిల్లీ కుర్రాడు 6–3, 4–6, 7–5తో ఆరో సీడ్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు.
గంటా 51 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. బాంబ్రీ కెరీర్‌లో ఇది రెండో అతిపెద్ద సింగిల్స్ విజయం. 2014 చెన్నై ఓపెన్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ ఫాబియో ఫొగిని ఫిట్‌నెస్ సమస్యతో మ్యాచ్ మధ్యలో వైదొలగడంతో బాంబ్రీ గెలుపొందాడు. ప్రిక్వార్టర్స్‌లో బాంబ్రీ అర్జెంటీనాకు చెందిన గైడో పెల్లాతో తలపడతాడు.