
క్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడిన యూకీ
సిటీ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. వాషింగ్టన్‌లో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ 4–6, 6–4, 3–6తో 45వ ర్యాంకర్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయాడు. యూకీకి 44,595 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 28 లక్షల 38 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
మరోవైపు ఇదే టోర్నీ మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా మీర్జా (భారత్)–మోనికా (రొమేనియా) ద్వయం 6–1, 5–7, 8–10తో బుచార్డ్ (కెనడా)–స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–డొనాల్డ్ యంగ్ (అమెరికా) జోడీ 5–7, 4–6తో మైక్ బ్రయాన్–బాబ్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో పరాజయం పాలైంది.