డబుల్స్‌లో యూకీ అర్హత | Yuki Bhambri to make Grand Slam debut in Australian Open doubles | Sakshi
Sakshi News home page

డబుల్స్‌లో యూకీ అర్హత

Published Sun, Nov 24 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

డబుల్స్‌లో యూకీ అర్హత

డబుల్స్‌లో యూకీ అర్హత

 షెన్‌జెన్ (చైనా): ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో పోటీపడేందుకు భారత రైజింగ్ స్టార్ యూకీ బాంబ్రీ అర్హత సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ‘వైల్డ్ కార్డు’ ప్లే ఆఫ్ టోర్నమెంట్‌లో యూకీ బాంబ్రీ తన భాగస్వామి మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో కలిసి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
 
  ఫైనల్లో యూకీ-వీనస్ జంట 7-6 (7/3), 1-6, 10-5తో మావో జిన్ గోంగ్-జీ లీ (చైనా) ద్వయంపై విజయం సాధించింది. ఈ విజయంతో ఈ ఇండో-కివీస్ జోడికి ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ మెయిన్ ‘డ్రా’లో పాల్గొనేందుకు ‘వైల్డ్ కార్డు’ ఖాయమైంది. అయితే సింగిల్స్ విభాగంలో మాత్రం యూకీకి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో యూకీ 6-7 (6/8), 4-6తో దీ వూ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement