
టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించేందుకు భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ మరో విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో యూకీ 6–0, 6–2తో కార్లోస్ తబెర్నర్ (స్పెయిన్)పై అలవోకగా గెలిచాడు.
కేవలం 57 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. పీటర్ పొలాన్‌స్కీ (కెనడా)తో జరిగే మూడో రౌండ్‌లో యూకీ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందుతాడు. 2015, 2016లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన యూకీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.