ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ
యెచోన్ (దక్షిణ కొరియా): కొత్త సీజన్‌లో తమ జోరు కొనసాగిస్తూ భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకంపై గురి పెట్టింది. ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, పర్ణిత్ కౌర్, అదితి స్వామిలతో కూడిన టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది.
సెమీఫైనల్లో జ్యోతి సురేఖ బృందం 233–229 పాయింట్లతో అమెరికా జట్టును ఓడించింది. టీమ్ క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంలో నిలువడం ద్వారా నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 236–234 పాయింట్లతో ఇటలీ జట్టుపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో టర్కీతో భారత జట్టు పోటీపడుతుంది. షాంఘైలో గతనెలలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి బృందం పసిడి పతకాన్ని సాధించింది.
మరోవైపు ప్రియాంశ్, ప్రథమేశ్, అభిõÙక్ వర్మలతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌంట్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 233–233తో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. స్కోరు సమం కావడంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే భారత ఆర్చర్లు సంధించిన బాణాల కంటే ఆసీస్ ఆర్చర్లు కొట్టిన రెండు బాణాలు కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో ఆస్ట్రేలియాకు కాంస్య పతకం ఖరారైంది.
Comments
Please login to add a commentAdd a comment