archery team
-
మన బాణం విఫలం
పారిస్: సీజన్లో రెగ్యులర్‌గా జరిగే ప్రపంచకప్ టోర్నీలలో పతకాలు సాధించే భారత ఆర్చర్లు ఒలింపిక్స్ క్రీడల్లో మాత్రం తమ వైఫల్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం భారత మహిళల రికర్వ్ జట్టు నిరాశాజనక ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగ్గా... భారత పురుషుల రికర్వ్ జట్టు కూడా అదే బాటలో పయనించింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్ (సిక్కిం), ప్రవీణ్ జాధవ్ (మహారాష్ట్ర)లతో కూడిన భారత బృందం లక్ష్యం దిశగా గురి తప్పి క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ర్యాంకింగ్ రౌండ్లో అద్భుత ఆటతీరుతో మూడో స్థానంలో నిలిచి తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 2–6తో మెటె గజోజ్, బెర్కిమ్ తుమెర్, అబ్దుల్లాలతో కూడిన టర్కీ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి సెట్‌ను 57–53తో, రెండో సెట్‌ను 55–52తో నెగ్గిన టర్కీ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో సెట్లో భారత జట్టు 55–54తో గెలిచి ఆధిక్యాన్ని 2–4కి తగ్గించింది. చివరిదైన నాలుగో సెట్లో టర్కీ బృందం 58–54తో నెగ్గి విజయాన్ని అందుకోవడంతోపాటు సెమీఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో టర్కీ 4–5తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. అనంతరం కాంస్య పతక పోరులో టర్కీ 6–2తో చైనాపై గెలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియా 5–1తో ఫ్రాన్స్‌పై గెలిచి ఏడోసారి టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం
యెచోన్ (దక్షిణ కొరియా): కొత్త సీజన్లో తమ జోరు కొనసాగిస్తూ భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకంపై గురి పెట్టింది. ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, పర్ణిత్ కౌర్, అదితి స్వామిలతో కూడిన టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ బృందం 233–229 పాయింట్లతో అమెరికా జట్టును ఓడించింది. టీమ్ క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంలో నిలువడం ద్వారా నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 236–234 పాయింట్లతో ఇటలీ జట్టుపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో టర్కీతో భారత జట్టు పోటీపడుతుంది. షాంఘైలో గతనెలలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి బృందం పసిడి పతకాన్ని సాధించింది. మరోవైపు ప్రియాంశ్, ప్రథమేశ్, అభిõÙక్ వర్మలతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌంట్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 233–233తో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. స్కోరు సమం కావడంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే భారత ఆర్చర్లు సంధించిన బాణాల కంటే ఆసీస్ ఆర్చర్లు కొట్టిన రెండు బాణాలు కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో ఆస్ట్రేలియాకు కాంస్య పతకం ఖరారైంది. -
పసిడిపై గురి
ఎస్–హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల ఆర్చరీ జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం క్వార్టర్ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత బృందం... గురువారం మరో రెండు విజయాలు సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం క్వార్టర్ ఫైనల్లో 6–0తో చి చుంగ్ టాన్, యు చెంగ్ డెంగ్, చున్ హెంగ్ చెలతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించింది. భారత్ తొలి సెట్‌ను 55–52తో, రెండో సెట్‌ను 55–48తో, మూడో సెట్‌ను 55–54తో గెల్చుకుంది. ఒక్కో సెట్‌కు రెండు పాయింట్ల చొప్పున ఇస్తారు. సెమీఫైనల్లో భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో వాన్ డెన్ బెర్గ్, వాన్ డెర్ వెన్, స్టీవ్ విజ్లెర్‌లతో కూడిన నెదర్లాండ్స్ జట్టుపై గెలిచింది. తొలి సెట్‌ను నెదర్లాండ్స్ 56–54తో, రెండో సెట్‌ను భారత్ 52–49తో, మూడో సెట్‌ను నెదర్లాండ్స్ 57–56తో, నాలుగో సెట్‌ను భారత్ 57–55తో గెల్చుకున్నాయి. దాంతో స్కోరు 4–4తో సమమైంది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించగా... భారత్ 29–28తో నెదర్లాండ్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. చివరిసారి 2005లో భారత్ ఫైనల్ చేరి తుది పోరులో 232–244తో కొరియా చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. చివరిసారి ఫైనల్ చేరిన నాటి భారత జట్టులోనూ తరుణ్‌దీప్ రాయ్ సభ్యుడిగా ఉండటం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ పోటీపడుతుంది. -
జాతీయ ఆర్చరీ పోటీలకు తెలంగాణ జట్లివే
హైదరాబాద్: జాతీయ జూనియర్ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్లను ఎంపిక చేశారు. మాసాబ్‌ట్యాంక్‌లోని హాకీ మైదానంలో అంతర్ జిల్లా అండర్-9, అండర్-14 పోటీల్లో రాణించిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో ఎనిమిది జిల్లాల నుంచి 80 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. జాతీయ ఆర్చరీ పోటీలు ఈనెల 11 నుంచి 16 వరకు తిరుపతిలో జరుగుతాయి. అండర్-14 ఇండియన్ రౌండ్ (బాలురు): వికాస్, ఆదిత్య (రంగారెడ్డి), ఎం.శ్రీకర్ (ఆదిలాబాద్), బి.అభిషేక్ (కరీంనగర్); బాలికలు: ఎన్.కావ్య, బి.నిఖిత (నిజామాబాద్), జి.వింధ్య, బి.మానసనయన (రంగారెడ్డి), ప్రతాప్ దాస్ (కోచ్). అండర్-14 రికర్వ్ రౌండ్ (బాలురు): జె.శ్రీరాజ్ (కరీంనగర్), మయాంక్ దీక్షిత్, వర్ధమాన్ గౌడ్, ఈవీఎస్ అభిషేక్ (హైదరాబాద్); బాలికలు: కె.సింధుజ (నిజామాబాద్, పి.ఐశ్వర్య (నిజామాబాద్), మౌలి జైన్, మనకన్ నేహా (హైదరాబాద్). కాంపౌండ్ రౌండ్ (బాలురు): బి.సాత్విక్ (రంగారెడ్డి), పాథి ఆర్యన్, టి.హర్ష (హైదరాబాద్), సి.సారుురామ్ గౌడ్ (మెదక్); బాలికలు: సీఎం ప్రాకృతి, కె.దేనుక, ఊర్జా ఇంజినీర్ (హైదరాబాద్), వినయ్ చక్రవర్తి (కోచ్), శివ కుమార్ (మేనేజర్). అండర్-9 ఇండియన్ రౌండ్ (బాలురు): విస్మయ్ ప్రభు (హైదరాబాద్), ఆద్య అగర్వాల్, మోదితశ్రీ, పల్లవి, అనన్య ఇవిత (హైదరాబాద్), రికర్వ్ రౌండ్ (బాలురు): ఎస్. ఆర్యన్, పి.సుహాస్ (రంగారెడ్డి), శ్రీహన్ కర్మ (హైదరాబాద్), బాలికలు: ఎ.మోక్షిత (రంగారెడ్డి), కాం పౌండ్ రౌండ్ బాలురు: జైదేవ్ (హైదరాబాద్).