
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో నేడు జరిగే ఫైనల్లో పటిష్టమైన కువైట్‌తో ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, కువైట్‌లు తలపడటం ఇది రెండోసారి. లీగ్ దశలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. లెబనాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ చక్కని ప్రదర్శనతో పెనాల్టీ షూటౌట్‌లో గెలిచింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మరో సెమీస్‌లో కువైట్ 1–0తో విజయం సాధించింది. కువైట్, లెబనాన్ పశ్చిమ ఆసియా దేశాలైనప్పటికీ పోటీతత్వం ఉండాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ రెండు దేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించాయి.
కంఠీరవ స్టేడియంలో ప్రేక్షకుల మద్దతుతో భారత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సొంతగడ్డపై జరుగుతుండటం భారత్‌కు అనుకూలాంశమైతే... హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ఈ ఫైనల్‌కు కూడా జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మైదానంలోకి వెళ్లి ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడంతో ‘రెడ్ కార్డ్’తో ఓ మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో లెబనాన్ తో కీలకమైన సెమీస్ మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే టోర్నీ క్రమశిక్షణ కమిటీ అతనికి రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ విధించడంతో.... కువైట్‌తో అమీతుమీకి కూడా గైర్హాజరు కానున్నారు.
1: ఇప్పటి వరకు భారత్, కువైట్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. భారత్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
.ట్రోఫీతో భారత జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్, కువైట్ జట్టు గోల్‌కీపర్ బదర్ బిన్ సానూన్
Comments
Please login to add a commentAdd a comment