నటుడు జీవన్ అధిపర్‌గా మారారు. పెణ్ కన్‌సోర్డియం స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై నవ నిర్మాత టీ శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం అధిపర్. పీబీ శరవణన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో జీవన్ హీరోగాను, నటి విద్య హీరోయిన్‌గానూ నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో దర్శకుడు సముద్రఖని, రంజిత్, రిచర్డ్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో తంబి రామయ్య, సింగముత్తు, రాజ్ కపూర్, శరవణ సుబ్బయ్య, భారతీ కణ్ణన్, సంగిలి మురుగన్, పావా లక్ష్మణన్, మదన్ బాబు, వయ్యాపురి, సంపత్ రాం, రేణుకా, కోవై సరళ, అలగు తదితరులు నటిస్తున్నారు.
దీనికి కథ, కథనం దర్శకత్వ బాధ్యతలను సూర్య ప్రకాష్ నిర్వహిస్తున్నారు. ఈయన గతంలో మాయి, దీవాన్, మాణిక్యం వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన విషయం గమనార్హం. అధిపర్ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, జీవితంలో సచ్చినా ఇతరులకు ద్రోహం చేయననే పాత్రలో నటుడు జీవన్ నటిస్తుండగా, నమ్మక ద్రోహమే జీవితంగా గడిపే పాత్రలో రంజిత్ నటిస్తున్నట్టు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథగా పేర్కొన్నారు. చిత్రం అధిక భాగం చెన్నై, పాండిచ్చేరి, మలేషియా ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగినట్టు వివరించారు. దీనికి విక్రమ్ సెల్వ సంగీతాన్ని, పిలిప్ విజయకుమార్ ఛాయగ్రహణం అందిస్తున్నారన్నారు.
అధిపర్‌గా జీవన్
Published Wed, Apr 15 2015 4:22 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM
Advertisement
Advertisement