
టాలీవుడ్ యంగ్ టైగర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే దుబాయ్‌లో సైమా అవార్డ్స్ వేడుకలకు హాజరైన జూనియన్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పని చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
అయితే తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఓ పాపను ఎంతో అప్యాయంగా తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోలో ఎన్టీఆర్‌తో ఉన్న పాప జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ మేనకోడలు అని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తారక్ అన్నతో నా మేనకోడలు అంటూ రామ్ ప్రసాద్ పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీ గ్లింప్స్, పోస్టర్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Naa Menakodalu & @tarak9999 anna ❤️ pic.twitter.com/Xh7hsN7JOA
— Auto RamPrasad (@RamPrasadAuto) September 30, 2023
Comments
Please login to add a commentAdd a comment