బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఫినాలేలో చోటు దక్కించుకునేందుకు రేసు మొదలైంది. కంటెస్టెంట్లు బంధాలు, అనుబంధాలను పక్కకు నెట్టి పూర్తిగా గేమ్‌పైనే ఫోకస్ పెడుతున్నారు. పంతొమ్మిది మందితో మొదలైన ఈ ప్రయాణంలో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు.. అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్, మోనాల్, సోహైల్, హారిక మాత్రమే మిగిలారు. టాప్ 5లో చోటు దక్కించుకోవడమే కాకుండా ట్రోఫీని ఎగరేసుకుపోవడమే లక్ష్యంగా కష్టపడుతున్నారు. అయితే వీరు లోపలెంత కష్టపడుతున్నారో వారిని గెలిపించేందుకు అంతకన్నా ఎక్కువే కష్టపడుతున్నారు వారి అభిమానులు. ఇక బిగ్‌బాస్ ప్రయాణం ముగింపుకు వస్తున్న తరుణంలో సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగుతూ వారి ఫేవరెట్ కంటెస్టెంట్లకే సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలువురు సీరియల్ నటీనటులు అఖిల్‌కు ఓటేయాలని కోరుతుండగా హీరో సందీప్ కిషన్ తన ఫుల్ సపోర్ట్ సోహైల్‌కే అని మొదట్లోనే చెప్పేశాడు. (చదవండి: ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌లోకి వెళ్లను : యాంకర్)
అవినాష్‌కు జీవితాన్ని ప్రసాదించిన జబర్దస్త్ యూనిట్ కూడా ఈ ప్రచారంలోకి దిగింది. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను.. అవినాష్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అవినాష్ చివరి వరకు ఉండాలని కోరుకుంటూనే అభిజిత్ అంటే ఇష్టమని చెప్పారు. అభి ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంటూ మొదటి నుంచి ఒకేలా ఉంటున్నాడంటూ అతడికి కూడా సపోర్ట్ చేశారు. తాజాగా బుల్లెట్ భాస్కర్ సైతం అభిజిత్‌కే మద్దతు తెలిపాడు. 'అందరూ బాగా ఆడుతున్నారు, కానీ నా ఫేవరెట్ మాత్రం అభిజిత్. అతడే గెలవాలని కోరుకుంటున్నా. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాడు. నిజాయితీగా ఉంటాడు. సహనంగా ఉండటం చాలా గొప్ప. అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్‌గా అవినాష్ గెలవాలని ఆశిస్తాను. కానీ ఓటు మాత్రం అభిజిత్‌కే" అని స్పష్టం చేశాడు. (చదవండి: వారిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే : నాగబాబు)
Comments
Please login to add a commentAdd a comment