ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు, ఎదుటివారిని కూడా నవ్విస్తుంది. తన పంచులతో, అల్లరితో, స్కిట్లతో కామెడీ పంచే లేడీ కమెడియన్స్ లిస్టులో పాగల్ పవిత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు పులుముకునే ఆమె జీవితంలో ఎంతో విషాదం ఉంది. తాజాగా ఆ విషాదాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది పవిత్ర. 'నాన్న లారీ డ్రైవర్. అమ్మ మహిళా రైతు. పని చేస్తే కానీ పూట గడవని ఫ్యామిలీ మాది. మూడు పూటలు తినడానికి కూడా ఆలోచించేవాళ్లం. నాన్న తాగుడుకు బానిసై మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు.
ఇంటర్ వరకు చదవడానికి కూడా మా పిన్ని సాయం చేసింది. ఇంకా వాళ్లను కష్టపెట్టడం ఎందుకని చదువు మానేసి హైదరాబాద్‌కు వచ్చి సెలూన్ పెట్టుకున్నాను. అనుకోకుండా జబర్దస్త్‌లో ఛాన్స్ వచ్చింది. సెలూన్ రన్ అవకపోవడంతో దాన్ని తీసేసి ఆ డబ్బుతో సొంతూరిలో మాకంటూ ఓ ఇల్లు కొనుక్కున్నాం. అప్పటిదాకా మాకు సొంతిల్లనేదే లేదు. తాగుడుకు బానిసయ్యాడని నాన్నతో 13 ఏళ్లు మాట్లాడలేదు. ఆయన ముఖం చూడటానికి ఇష్టపడేదాన్ని కాను. ఏడాది క్రితమే ఆయన చనిపోయారు. ఆ క్షణం నేను సంతోషంగా ఫీలయ్యాను' అని చెప్తూనే కంటతడి పెట్టుకుంది పవిత్ర.
Comments
Please login to add a commentAdd a comment