Jabardasth Pavithra
-
వాలెంటైన్స్ డే.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బుల్లితెర నటి
బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్‌గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వాలెంటైన్స్ డే రోజునే తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసి అందరికీ షాకిచ్చింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అధికారికంగా తెలిపింది. తాను ప్రేమించిన సంతోష్‌తో పవిత్ర ఉంగరాలు కూడా మార్చుకుంది. ఓ రకంగా ఎంగేజ్మెంట్ జరిగినట్లే అని త్వరలో పెళ్లితో ఒకటి అవుతారని అందరూ అనుకున్నారు. సుమారు రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సంతోష్‌తో విడిపోతున్నట్లు వాలెంటైన్స్ డే సమయంలోనే పవిత్ర ఇలా తెలిపింది. 'మా శ్రేయోభిలాషులందరికీ మా ఇద్దరి పరస్పర అంగీకారం ద్వారా ఈ విషయం చెబుతున్నాను. సంతోష్, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా మార్గాలు వేరుగా ఉన్నా.. మేము పంచుకున్న క్షణాలు చాలా ప్రత్యేకం. జీవితంలో మా వ్యక్తిగత ప్రయాణాలలో ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మాకు మద్దతుతో పాటు గోప్యత ఇవ్వాలని మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాము, మేము ముందుకు సాగేందుకు మీ ప్రేమ, మద్దతు ఉంటుంది అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అంటూ ఇన్‌స్టాలో పవిత్ర తెలిపింది. గతంలో సంతోష్ గురించి పవిత్ర చెప్పిన మాటలు సంతోష్‌తో ప్రేమలో ఉన్నానంటూ గతంలో పవిత్ర ఇలా తెలిపింది. 'నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..' అని పవిత్ర చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సంతోష్,పవిత్ర ఇద్దరూ విడిపోవడంతో వారిని అభిమానించే వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ.. ఇలాంటి సమయంలో ఇద్దరూ మరింత బలంగా ఉండాలని ఆశిస్తున్నారు. గతాన్ని వదిలేసి జీవితంలో కొత్త అడుగులు వేయాలని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Jabardasth_pavithraa (@jabardasth_pavithraa) -
ఏడాదిగా వెయిటింగ్.. ఎస్ చెప్పిన పవిత్ర.. నిశ్చితార్థం ఫోటో వైరల్
బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్‌గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అయితే ఆమె ఇప్పటికే తన పెళ్లి విషయంలో రెండుసార్లు ఫ్రాంక్ వీడియోలు చేసింది. కానీ మూడోసారి మాత్రం అలాంటిది ఏమీ లేకుండా నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడు సంతోష్‌తో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్ చేసింది. సంతోష్‌కు ఓకే చెప్పిన పవిత్ర 'నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..' అని తన పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది పవిత్ర. ఏడాది నుంచి ఎదురుచూస్తున్న సంతోష్ అలాగే వారి ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అయితే పవిత్ర అభిమానులకు సంతోష్ కుమార్ ఇదివరకే తెలుసు. గతంలో ఇతడు స్టేజిమీద అందరి ముందే పవిత్రకు లవ్ ప్రపోజ్ చేశాడు. కానీ అప్పుడు ఏ సమాధానమూ చెప్పని పవిత్ర.. తర్వాత సంతోష్ కుమార్‌తో కలిసి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే యాంకర్ వారిని లవ్ ప్రపోజ్ చేసుకోవాలని కోరగా ఆమె తెగ సిగ్గుపడింది. ఎట్టకేలకు అతడితోనే ఏడడుగులు వేసేందుకు రెడీ అవడంతో అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. View this post on Instagram A post shared by Jabardasth_pavithraa (@jabardasth_pavithraa) చదవండి: గిన్నిస్ రికార్డు.. ఆయనే నా సూపర్ హీరో అంటున్న సుమ -
నాన్న తాగుబోతు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి: పవిత్ర
ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు, ఎదుటివారిని కూడా నవ్విస్తుంది. తన పంచులతో, అల్లరితో, స్కిట్లతో కామెడీ పంచే లేడీ కమెడియన్స్ లిస్టులో పాగల్ పవిత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు పులుముకునే ఆమె జీవితంలో ఎంతో విషాదం ఉంది. తాజాగా ఆ విషాదాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది పవిత్ర. 'నాన్న లారీ డ్రైవర్. అమ్మ మహిళా రైతు. పని చేస్తే కానీ పూట గడవని ఫ్యామిలీ మాది. మూడు పూటలు తినడానికి కూడా ఆలోచించేవాళ్లం. నాన్న తాగుడుకు బానిసై మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. ఇంటర్ వరకు చదవడానికి కూడా మా పిన్ని సాయం చేసింది. ఇంకా వాళ్లను కష్టపెట్టడం ఎందుకని చదువు మానేసి హైదరాబాద్‌కు వచ్చి సెలూన్ పెట్టుకున్నాను. అనుకోకుండా జబర్దస్త్‌లో ఛాన్స్ వచ్చింది. సెలూన్ రన్ అవకపోవడంతో దాన్ని తీసేసి ఆ డబ్బుతో సొంతూరిలో మాకంటూ ఓ ఇల్లు కొనుక్కున్నాం. అప్పటిదాకా మాకు సొంతిల్లనేదే లేదు. తాగుడుకు బానిసయ్యాడని నాన్నతో 13 ఏళ్లు మాట్లాడలేదు. ఆయన ముఖం చూడటానికి ఇష్టపడేదాన్ని కాను. ఏడాది క్రితమే ఆయన చనిపోయారు. ఆ క్షణం నేను సంతోషంగా ఫీలయ్యాను' అని చెప్తూనే కంటతడి పెట్టుకుంది పవిత్ర. చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న దివ్యవాణి? నటి ఏమందంటే?