కష్టాలతో సావాసం.. పేరెంట్స్‌కు ఫైమా ఊహించని గిఫ్ట్‌! | Jabardasth Faima Buys Home and Car For Parents | Sakshi
Sakshi News home page

Faima: చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లోనే.. ఎట్టకేలకు సొంతింటి కల సాకారం!

Published Sat, Feb 25 2023 4:00 PM | Last Updated on Sat, Feb 25 2023 4:16 PM

Jabardasth Faima Buys Home and Car For Parents - Sakshi

చిన్నప్పుడు అద్దె ఇంట్లో కష్టాలు పడ్డ ఫైమా తన పేరెంట్స్‌కు ఎప్పటికైనా ఒక ఇల్లు కొనివ్వాలని కంకణం కట్టుకుంది. అయితే తన కష్టార్జితంతో తన కుటుంబానికోసం ఓ ఇల్లు కొన్నానని, ప్రస్తుతం దా

పటాస్‌, జబర్దస్త్‌ వంటి కామెడీ షోలతో బాగా క్లిక్కైంది ఫైమా. స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే ఫైమా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ స్టేజీదాకా రావడానికి కారణం తన పేరెంట్స్‌ సపోర్టేనని తరచూ చెప్తూ ఉంటుంది. చిన్నప్పుడు అద్దె ఇంట్లో కష్టాలు పడ్డ ఫైమా తన పేరెంట్స్‌కు ఎప్పటికైనా ఒక ఇల్లు కొనివ్వాలని కంకణం కట్టుకుంది. కాగా తన కష్టార్జితంతో తన కుటుంబానికోసం ఓ ఇల్లు కొన్నానని, ప్రస్తుతం దాని ఇంటీరియర్‌ డిజైన్‌ జరుగుతోందంటూ గుడ్‌న్యూస్‌ చెప్పిందీ కమెడియన్‌. అలాగే తన పేరెంట్స్‌ కోసం ఓ కారు కూడా కొంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ మేరకు యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది.

'మా ఇంట్లో అబ్బాయిలు లేరు. చుట్టుపక్కల వాళ్లు తమ కొడుకు కారులో ఎక్కిపోతుంటే మా పేరెంట్స్‌ ముఖంలో బాధ చూశాను. అప్పుడు ఆ బాధను తగ్గించేందుకు స్కూటీ తీసుకుని దానిపై వాళ్లను తిప్పాను. కానీ వాళ్లను కూడా ఏదో ఒకరోజు కారులో ఎక్కించుకుని తిరగాలనుకున్నాను. అదిప్పుడు నిజం కాబోతోంది' అంటూ ఎమోషనలైంది. షోరూమ్‌కు వెళ్లి కారును సెలక్ట్‌ చేసిన ఫైమా త్వరలో కారులో తిరగబోతున్నామంటూ సంతోషం వ్యక్తం చేసింది.

చదవండి: రష్మీపై చేతబడి, యాసిడ్‌ దాడి చేస్తామంటూ పోస్టులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement