కమెడియన్‌గా నిలదొక్కుకున్న ఎంతోమంది జీవితంలో కష్టాలను దాటుకుని ముందుకువచ్చినవారే! బుల్లితెర కమెడియన్స్ పృథ్వీరాజ్, రిషి కుమార్ ఈ కోవలోకే వస్తారు. ఈ చైల్డ్ ఆర్టిస్టులిద్దరూ జబర్దస్త్ షోలో నవ్వులు పూయిస్తున్నారు. అయితే తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయంటోంది పృథ్వీ, రిషిల తల్లి శ్రీలత. తాజాగా ఆమె తన కుమారులతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'దేవుడు నా ఇద్దరు పిల్లల్ని మరుగుజ్జులుగా పుట్టించాడు. మూడోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మళ్లీ వీరిలాగే పుడతారేమోనని ఆపరేషన్ చేసి తీయించేసుకున్నాను. మా ఆయన ఆటో డ్రైవర్. రోజుకు రూ.400 వస్తాయి. మా అమ్మకు యాక్సిడెంట్‌లో చేయి పోయింది. తనను నేనే చూసుకోవాలి. అటు ఇద్దరు పిలల్ల్ని చూసుకోవాలి. వీళ్లకు జబర్దస్త్ షోలో ఇచ్చే డబ్బులు రానుపోను చార్జీలకే సరిపోతున్నాయి. హైదరాబాద్‌కు వచ్చిపోవడానికే ఏడువేల రూపాయలు అవుతాయి.
రిషికి గుండెలో హోల్ ఉంది.. ఆపరేషన్ చేయించాం. కానీ మూడు నెలలకోసారి చెకప్‌కు తీసుకెళ్లాలి. అప్పుడో రూ.10 వేలు అవుతాయి. తనకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలన్నారు. కానీ మాకున్న స్థోమతకు మంచి ఆహారాన్ని సమకూర్చలేము. నేను కూడా గతంలో జూనియర్ ఆర్టిస్టుగా ఐదేళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు నా పిల్లలు కష్టపడుతున్నారు. అయినా అందరూ హేళన చేస్తున్నారు. ఇద్దరు పిల్లల ఆరోగ్యం బాలేకపోవడంతో రూ.5 లక్షల అప్పు చేశాం. వడ్డీ కడుతున్నాం కానీ అప్పు తీర్చేంత డబ్బు మా చేతిలో ఉండట్లేదు. అప్పులవాళ్లేమో తిడుతున్నారు' అంటూ ఏడ్చేసింది శ్రీలత.
చదవండి: ఎంగేజ్‌మెంట్ ఆగిపోవడానికి కారణమిదే! పెళ్లి చేసుకోవాలనుంది.. త్వరలోనే జరుగుతుంది
Comments
Please login to add a commentAdd a comment