
20 ఏళ్లుగా ప్రయత్నిస్తే అప్పుడు జబర్దస్త్‌లో అవకాశం వచ్చిందని కమెడియన్ సత్తిపండు తెలిపారు.అంతకుముందు..
కశింకోట: ప్రముఖ హస్య నటునిగా ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానమే తన లక్ష్యమని జబర్దస్త్ సత్తిపండు (పీఎన్‌వీ సత్యనారాయణ) పేర్కొన్నారు. కశింకోటలో ఆదివారం ఒక కార్యక్రమంలో తన బృందంతో సందడి చేశారు. భార్యాభర్తల అన్యోన్యతపై స్కిట్ ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. జబర్దస్త్‌లో సుమారు 250 వరకు స్కిట్లు ప్రదర్శించినట్టు చెప్పారు. చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ? అబ్బాయి ఎవరంటే..
సుమారు 20 ఏళ్లుగా సినిమాలు, టీవీల్లో ప్రదర్శన కోసం ప్రయత్నిస్తే ఆరేళ్ల క్రితం జబర్దస్త్‌లో అవకాశం వచ్చిందన్నారు. అంతకు ముందు నాటకాలు వేసినట్టు పేర్కొన్నారు. దృశ్యం–2, ఆర్డీఎక్స్ లవ్, విజేత, హలో శ్యామ్, ప్రేమ కోసం తదితర సినిమాల్లో నటించినట్టు సత్తిపండు పేర్కొన్నారు. ప్రస్తుతం హలో ఆది, అతిథి దేవోభవ, గీతా ఆర్ట్స్‌లో అల్లు శిరీష్ సినిమాతోపాటు కల్యాణ్‌రామ్ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు.