ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్‌ కమెడియన్‌ అరెస్ట్‌ | Jabardasth Comedian Nava Sandeep Arrested For Cheating - Sakshi
Sakshi News home page

Jabardasth Comedian Nava Sandeep: జబర్దస్త్‌ కమెడియన్‌ అరెస్ట్‌

Aug 25 2023 8:50 AM | Updated on Aug 25 2023 1:50 PM

Jabardasth Comedian Nava Sandeep Arrested For Cheating - Sakshi

జబర్దస్త్‌ కమెడియన్‌ నవసందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రేమపేరుతో యువతిని మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు నవసందీప్‌ను మధురానగర్‌లో అరెస్ట్‌ చేశారు. కాగా ఇటీవల ఓ యువతి.. తనను నవసందీప్‌ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు నటుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జబర్దస్త్‌ నటుడు నవసందీప్‌ 2018లో ఓ యువతికి ప్రేమకబుర్లు చెప్పి దగ్గరయ్యాడు. నిత్యం వాట్సాప్‌ చాటింగ్‌ చేసేవాడు. ఆమెను ఊరి నుంచి హైదరాబాద్‌కు రప్పించాడు. షేక్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఆ యువతి నాలుగేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో త్వరలో పెండ్లి చేసుకుంటానని నమ్మించి తన కోరిక తీర్చుకున్నాడు. తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తేగానే ముఖం చాటేశాడు. తాను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నవసందీప్‌ను అరెస్ట్‌ చేశారు.


చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ
2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement