![Jabardasth Lady Comedian Rithu Chowdary Getting Married - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/07/18/5_0.jpg.webp?itok=ddA_NYvl)
Jabardasth Lady Comedian Rithu Chowdary Getting Married: బుల్లితెర షో జబర్దస్త్‌తో ఫేమ్ సంపాదించిన వారిలో రీతూ చౌదరి ఒకరు. లేడీ కమెడియన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతూ చౌదరి పలు సీరియల్స్‌తోనూ తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైంది. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు తదితర సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటీ.
అయితే తాజాగా రీతూ పెట్టిన ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫొటో చూసిన వారంతా రీతూ చౌదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని ఊహిస్తున్నారు. అయితే ఆమె ఈ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు కానీ, ఈ ఫొటోకు రితూ ఇచ్చిన క్యాప్షన్ చూస్తే దాదాపు ఆమె పెళ్లి కాయమైనట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తితో రీతూ దిగిన ఫొటోను షేర్ చేస్తూ 'మా బంధం కంటే గొప్పగా ఇంకేదీ ఉండదు' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పలువురు నెటిజన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు.
చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్
పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలో రీతూతో ఉన్నది ఎవరా ? అనే ఆసక్తి నెటిజన్స్‌లో మొదలైంది. వివరాల్లోకి వెళితే రీతూతో ఉన్న వ్యక్తి పేరు శ్రీకాంత్ అని, అతను సంపన్న వ్యాపారస్థుడని, ప్రస్తుతం రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
చదవండి: రామ్ గోపాల్ వర్మకు షాక్.. 'లడ్కీ' సినిమాపై కోర్టు స్టే..
బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్..
Comments
Please login to add a commentAdd a comment