అభిమాన స్వాగతం
Published Mon, Dec 9 2013 2:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :ప్రకాశం జిల్లా యద్దనపూడి వెళ్తూ ఆదివారం ఉదయం చిలకలూరిపేట ధనలక్ష్మి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా పార్టీ నాయకులు, అభిమానులు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ జిల్లాకు వచ్చిన ఆయన్ని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గెస్ట్‌హౌస్ ప్రాంగణంతో పాటు అక్కడి పరిసరాలు పార్టీ నాయకులతో కిటకిటలాడాయి. ఆదివారం ఉదయం 4.45 గంటలకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో తెనాలి చేరుకున్న వైఎస్ జగన్ రోడ్డు మార్గాన ప్రయాణించి ఆరు గంటలకు చిలకలూరిపేట చేరుకున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఏర్పాటు చేసిన అతిథి గృహంలో గంటన్నరసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి తిరిగి ప్రకాశం జిల్లా యద్దనపూడికి బయలుదేరారు.
ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు వచ్చిన వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలందరూ యువనేతకు ఎదురేగి అభివాదం చేసి స్వాగతం పలికారు. వారందరినీ పేరుపేరునా పలకరించిన వైఎస్ జగన్ కొద్దిసేపు పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడారు. పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాంతో కార్యక్రమ షెడ్యూలుపై చర్చించారు. అనంతరం చిలకలూరిపేట, బాపట్ల, తెనాలి, నర్సరావుపేట, వేమూరు, గుంటూరు, తాడికొండ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, కోన రఘుపతి, గుదిబండి చినవెంటకరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున,
ఈపూరి అనూప్, షేక్ షౌకత్, నసీర్‌లతో పాటు పార్టీ ప్రముఖులు గజ్జల నాగభూషణరెడ్డి, దాది లక్ష్మీరాజ్యం, కావటి మనోహర్, కొడాలి నాని, బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జోగి రమేష్‌లతో కొద్దిసేపు మాట్లాడారు. పార్టీ నాయకులు మందపాటి శేషగిరిరావు, కావటి మనోహర్‌నాయుడు, సయ్యద్‌మాబు, దేవళ్ల రేవతి, నూతలపాటి హనుమయ్య, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు జగన్‌ను కలిసి కరచాలనం చేశారు. వీరందరినీ బాగున్నారా? అంటూ వైఎస్ జగన్ పలకరించారు. అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన ఆయన్ని చుట్టుముట్టిన వందలాది మంది అభిమానులు పూల వర్షంతో ముంచెత్తారు. ‘జైజగన్’ అన్న నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త గుదిబండి చిన వెంకటరెడ్డి అందించిన ప్రత్యేక పోస్టర్‌ను జగన్ ఆవిష్కరించారు.
జనసంద్రమైన అంకిరెడ్డిపాలెం చౌరస్తా...
ప్రకాశం జిల్లా నుంచి జాతీయ రహదారి మీదుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువనేత జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగత పలికేందుకు గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం చౌరస్తా వద్ద వేలాది మంది యువకులు, మహిళలు బారులు తీరారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు పార్టీ సమన్వయకర్త రాతంశెట్టి రామాంజనేయులు ఆధ్వర్యంలో మోటార్‌బైక్‌లపై తరలి వచ్చిన వందలాది ముంది యువకులు జాతీయ రహదారిపై నిలబడి నినాదాలతో హోరెత్తించారు. వీరందరినీ ఆప్యాయంగా పలకరించిన జగన్ పార్టీ కోసం పనిచేయండంటూ సూచించారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు ముందుకెళ్లి జగన్‌కు శాలువా కప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, నసీర్ అహ్మద్, షౌకత్, గులాం రసూల్, చాంద్‌బాషా, మహ్మద్ ముస్తఫా, నూనె ఉమామహేశ్వరరెడ్డి, కొల్లిపర రాజేంద్రప్రసాద్, అంగడి శ్రీనివాసరావు, నర్సిరెడ్డి, మహమూద్, విజయ్‌కుమార్, జగన్‌కోటి, దాసరి శ్రీనివాసరావులతో పాటు పలువురు మహిళా నాయకురాండ్రు కానూరి నాగేశ్వరి, ఝాన్సీ, మేరీ, కొత్తా చిన్నపరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement