
కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన విక్రమ్ వేదా సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఈ రీమేక్ ఓకె అయినట్టుగా వార్తలు వినిపించాయి. తమిళ్‌లో మాదవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించగా తెలుగు వర్షన్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తలపై విక్రమ్ వేదా నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య, రాజశేఖర్ విక్రమ్ వేదా రీమేక్‌లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ పుకార్లని కొట్టిపారేశారు. అంతేకాదు ఇప్పటి వరకు విక్రమ్ వేదా రీమేక్ రైట్స్‌ను ఎవరికీ ఇవ్వలేదన్న వై నాట్ స్టూడియోస్ ప్రతినిధులు, అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment