![Bigg Boss Telugu 6: Faima Use Eviction Free Pass - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/27/faima-raj-pass.gif.webp?itok=I9U_CiU9)
బిగ్‌బాస్ ఆడే ఆటలో కంటెస్టెంట్లు పావులు మాత్రమే. వారు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వారిని కచ్చితంగా చేసి తీరతారు. అందుకు నేటి ఎపిసోడ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్‌లో తొమ్మిది మంది ఉండగా వారిలో కొందరిని నిన్ననే సేవ్ చేశాడు నాగ్. మిగిలినవారిని ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరకు రాజ్, ఫైమా ఇద్దరే మిగిలారు. తను సేవ్ అయిపోతానని బలంగా నమ్మిన ఫైమా మొదటగా తన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను రాజ్ కోసం వాడేందుకు సిద్ధమైంది.
కానీ నాగార్జున ఆలోచించుకోమని, మీ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకో అంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె భయపడిపోయి చివరి నిమిషంలో తనకోసమే వాడుతున్నట్లు ప్రకటించింది. తీరా ఓటింగ్‌లో ఫైమానే చివరి స్థానంలో ఉండగా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కింది. ఒకవేళ ఆ పాస్ వాడకపోయుంటే మాత్రం ఫైమా ఈ వారం బయటకు వచ్చేదే! ఫైమా సేవ్ అయిపోవడంతో ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుందనుకునేరు, కానే కాదు! ఓటింగ్‌లో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను అన్యాయంగా బయటకు పంపించేశారట. అంటే బిగ్‌బాస్ ఆడే ఆటలో రాజ్ బలైపోయాడన్న మాట.
చదవండి: ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు: రేవంత్
ఓటీటీలో లవ్ టుడే, ఎప్పటినుంచంటే
Comments
Please login to add a commentAdd a comment