Bigg Boss 6 Telugu Latest Promo: Rohit Mother Surprise Entry In BB House, Video Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: రాజ్‌ను ఆడుకున్న స్టూడెంట్స్‌, ఆమెను చూసి రోహిత్‌ ఎమోషనల్‌

Published Wed, Nov 23 2022 4:41 PM | Last Updated on Wed, Nov 23 2022 10:56 PM

Bigg Boss Telugu 6: Rohit Mother Surprise Entry To BB House - Sakshi

ఈరోజు శ్రీసత్య, ఫైమా, రోహిత్‌ తల్లి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రోహిత్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని వెనక నుంచి వచ్చి కళ్లు మూసింది

ఇంటిసభ్యుల రాకతో హౌస్‌మేట్స్‌ ముఖాలు మతాబుల్లా వెలిగిపోతున్నాయి. ఇప్పటికే ఆదిరెడ్డి తన కూతురి బర్త్‌డేను హౌస్‌లో సెలబ్రేట్‌ చేసినందుకు ఎగిరి గంతేస్తుండగా నెక్స్ట్‌ మా కోసం ఎవరు రాబోతున్నారా? అని ఇతర కంటెస్టెంట్లు గేటు వంక ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు శ్రీసత్య, ఫైమా, రోహిత్‌ తల్లి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రోహిత్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని వెనక నుంచి వచ్చి కళ్లు మూసింది అతడి తల్లి. ఆమె స్పర్శ తగలగానే రోహిత్‌ ఎమోషనలయ్యాడు. అమ్మ చేతిని ఆప్యాయంగా ముద్దాడుతూ తనపై ప్రేమను గుమ్మరించాడు.

మరోపక్క మ్యూజిక్‌ క్లాస్‌లో టీచర్‌ రాజ్‌ను ఆడేసుకున్నారు విద్యార్థులు. వీరెక్కడ దొరికార్రా బాబూ అనుకున్న రాజ్‌ వారినేం చేయలేక తల పట్టుకున్నాడు. మొత్తానికి గొడవలు పక్కన పెట్టేసి సంతోషంలో మునిగి తేలుతున్నారు హౌస్‌మేట్స్‌. మరి ఈ ఫ్యామిలీ సందడిని చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

చదవండి: ఆదిరెడ్డి కలను నిజం చేసిన బిగ్‌బాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement